![]() |
![]() |
.webp)
సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి రీసెంట్ గా ఒక మూవీ కూడా చేసాడు. బబుల్ గం మూవీలో రోషన్ కనకాల నటనకు సంబందించిన ఎన్నో విషయాల గురించి చెప్పారు రాజీవ్ కనకాల. "చాలా మంది కొన్నేళ్ల పాటు చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ రోషన్ కి ఫస్ట్ మూవీకే వచ్చేసింది. యాక్టింగ్ అనేది డిఎన్ఏలో ఏమీ ఉండదు ...బ్లడ్ లో బ్లడ్ గ్రూప్ ఉంటుంది కానీ నటన ఎలా ఉంటుంది. నేనేవన్నీ నమ్మను.. నటన నేర్చుకుంటే, చూస్తే, తెలుసుకుంటే వస్తుంది. మా తాత ఈ ఫీల్డ్ కానే కాదు. ఆయన స్టేజి నాటకాలు వేసిన అనుభవం కూడా లేదు.
నేను పుట్టిన దగ్గరనుంచి పెళ్ళైన రెండేళ్ల వరకు కూడా నాకు ఇల్లు, ఇన్స్టిట్యూట్ కూడా ఒకటే. కానీ రోషన్ కి మాత్రం చిన్నప్పుడే చాలా ఫ్రీడమ్, ఇండివిడ్యువాలిటీ వచ్చేసింది. బాబు బికాం చేసాడు..పాప 12 వ తరగతి చదువుతోంది. అమ్మ, నాన్న, సోదరి వరసగా నాకు దూరమైపోయేసరికి చాలా బాధేసింది. చాలామంది అనుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో ఎక్కువగా చేస్తాను అని.. కానీ సింహాద్రి, రామయ్య వస్తావయ్యా, బృందావనం, సుబ్బు మూవీస్ లో నేను లేను. భవిష్యత్తులో మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేసేలా ఆలోచిస్తున్నాను. నాకు పెద్దగా వంట రాదు. కానీ ఆమ్లెట్ బాగా వేస్తా..పేపర్ దోశ కూడా చాలా బాగా వేస్తాను. పెళ్లంటే అండర్స్టాండింగ్...అందులో ఎన్నో అపార్థాలు కూడా వస్తాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే అసలు ఏ సమస్యలూ రావు. నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నా పిల్లలు లవ్ మ్యారేజ్ అన్నా కూడా నాకు నో ప్రాబ్లమ్. రోషన్ కి మలయాళం వచ్చు..అక్కడ ఏ అమ్మాయి నచ్చినా పెళ్లి చేస్తాం...కొన్ని మూవీస్ రిలీజ్ కి రెడీగ ఉన్నాయి..వాటికి ఇంకా పేర్లు కూడా పెట్టలేదు " అని చెప్పాడు రాజీవ్ కనకాల.
![]() |
![]() |